Header Banner

మయన్మార్ లో మళ్లీ 5.6 తీవ్రతతో భూకంపం.. తర్వాత కూడా వచ్చే ఛాన్స్ - ప్రజల భయాందోళన..

  Sun Apr 13, 2025 11:48        World

మయన్మార్‌లో ఆదివారం (ఏప్రిల్ 13, 2025న) రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, 35 కి.మీ లోతులో సంభవించింది. ఈ ప్రకంపనలు మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలను వణికించాయి. ముఖ్యంగా షాన్ రాష్ట్రంలోని కెంగ్‌తుంగ్ పట్టణం దక్షిణ పశ్చిమ దిశలో 76 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించబడింది. ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం సంభవించలేదు. దీనికి ముందు కూడా మరికొన్ని భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1గా ఉంది. ఈ ప్రకంపనలు 10 కి.మీ లోతులో సంభవించాయి. అయితే ఈ భూకంపం తరువాత మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ​ భూమి కంపించిన నేపథ్యంలో జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

 

ఇది కూడా చదవండి: మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

భూకంప కేంద్రం పరిగణించిన సమాచారం ప్రకారం, స్వల్పకాలికమైనా, ఈ ప్రకృతి వైపరీత్యం పట్ల ప్రజలు ఆందోళన చెందారు. మరోవైపు విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమై, ప్రజలకు సూచనలు జారీ చేసింది. భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలకు సూచనలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి మాత్రం సమాచారం తెలియాల్సి ఉంది. మార్చి 287.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం నుంచి శనివారం నాటికి మయన్మార్, పరిసర ప్రాంతాలలో మొత్తం 468 అనంతర ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ సంఖ్య భూకంపాల సీరీస్ తీవ్రతను, దీర్ఘకాలిక ప్రభావాన్ని సూచిస్తుంది. ఇటీవల భూకంపం తరువాత, మయన్మార్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సహాయ సంస్థలు సహాయక చర్యలను అందించాయి. చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు రక్షణ బృందాలు, వైద్య సిబ్బందిని మయన్మార్‌కు పంపాయి. భారత్ 'ఆపరేషన్ బ్రహ్మ' ద్వారా 15 టన్నుల సహాయ వస్తువులను పంపించింది. ఈ క్రమంలో భూకంపాల ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు భూకంపాల నుంచి రక్షణ పొందేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.​

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MyanmarEarthquake #Myanmar #EarthquakeDeathToll